-
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్..
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్కౌంటర్ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్కౌంటర్ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది. బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్ ఎంవీ ప్రాంజల్(కర్ణాటక), కెప్టెన్ శుభమ్ గుప్తా(యూపీ), పారా ట్రూపర్ సచిన్ లౌర్(యూపీ), హవల్దార్ అబ్దుల్ మాజిద్(జమ్మూకశ్మీర్)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్లోని బాజిమాల్ ప్రాంతంలో బుధవారం ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే. రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసినట్లయిందని తెలిపారు. మృతుల్లో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
‘నాకేమీ వద్దు ప్లీజ్ లే నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు..’
దాల్పట్: ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ ఓ చిన్నారి.. జవాన్ తండ్రి కోసం కంటతడి పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి అక్కడున్న వారంతా ఆవేదన చెందారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రదాడుల్లో మృతిచెందిన పారాట్రూపర్ నీలంసింగ్ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. మృతిచెందిన వారిలో హవిల్దార్ నీలంసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలంసింగ్ శవపేటిక శనివారం స్వగ్రామం చేరుకుంది. దీంతో, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీలంసింగ్కు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఇక, నీలంసింగ్ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుమార్తె పవనా చిబ్(10).. ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ కన్నీరుపెట్టింది. పక్కనే నిలుచున్న నీలంసింగ్ భార్య వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా, వేల మంది సమక్షంలో దలపత్ గ్రామంలో శనివారం నీలంసింగ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు.. రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. Papa aap ku nhai bol rahe, Papa Aap Ku Humain Chor ker jaa rahey hain, 😢😢 Last rites of Martyr Havildar Neelam Singh at his native village in Akhnoor. This bloodshed must stop now. How will this daughter live without her father now? I request the governments of India and… pic.twitter.com/dpLawcSr3Q — Mohammed Hussain (@hussain_hrw) May 7, 2023 ఇది కూడా చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత -
Rajouri: గ్రామస్థుల చేతికే ఆయుధాలు.. కేంద్రం సంచలన నిర్ణయం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఇళ్లల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక అడుగు వేసింది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 5,000 మంది స్థానికులు ఆయుధాల కోసం పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా వీడీజీగా ఈ నిఘా బలగాలను పిలుస్తారు. గడిచిన రెండు దశాబాద్దాల్లో భారీస్థాయిలో గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా కమిటీలను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. ఈ గ్రూపుల్లోని ప్రతిఒక్కరికి .303 రైఫిల్, 100 రౌండ్ల తూటాలు అందిస్తారు. అలాగే వారికి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ కూడా అందించాలని ప్రభుత్వం భవిస్తోంది. ఏమిటీ ఈ గ్రామ రక్షణ కమిటీలు? జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రత పరిరక్షణ పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. 1990లో దోడా జిల్లాలో మైనారిటీలపై దాడులు జరిగిన క్రమంలో తొలిసారి వీడీసీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, ఇతర జిల్లాల ప్రజలకు ఆయుధాలు అందించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 28000 మంది వీడీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా హిందూ, సిక్కు, ముస్లిం వర్గాలకు చెందినవారు ఉన్నారు. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోలీసు బలగాల ప్రాబల్యం పెరిగిన క్రమంలో ఈ కమిటీల ఉనికి తగ్గిపోయింది. కానీ, ఇటీవలే హిందువులపై ఉగ్రదాడి తర్వాత గ్రామ రక్షణ కమిటీలు తిరిగి పురుడుపోసుకున్నాయి. రాజౌరీ జిల్లాలోని పంచాయతీల్లో ఆయుధాలను తనిఖీ చేసి గ్రామస్థులకు శిక్షణ ఇస్తోంది పోలీసు శాఖ. చాలా కాలం క్రితం కుటుంబంలోని పెద్దలకు, తల్లిదండ్రులకు అందించిన ఆయుధాలను యువకులు చేతబడుతున్నారు. ‘రైఫిల్‌ను శుభ్రం చేసుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దీనిని తనిఖీ చేయిస్తున్నా. మాపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నా.’ అని టింకూ రైనా అనే ఓ యువకుడు తెలిపారు. తాను పోలీసు రికార్డుల్లో పేరు నమోదు చేసుకోలేదని, కానీ తన వద్ద .303 రైఫిల్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జోగిందర్ సింగ్ అనే మరో యువకుడు తన ఇంట్లో వారికి చెందిన రెండు రైఫిల్స్‌ను ఆయుధాల తనిఖీ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను వీడీసీ బృందంలో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఆయుధాల అందజేత.. వీడీసీ గ్రూప్ సభ్యులకు కొత్త ఆయుధాలు అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా పోలీస్ చీఫ్ మొహమ్మద్ అస్లాం. ఫైరింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. మరోవైపు.. వీడీసీ సభ్యులకు రూ.4000 గౌరవవేతనం ఇస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత వరకు అమలులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వీడీసీలకు అందిస్తున్న ఆయుధాలు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి. సుమారు 200లకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. రంగంలోకి భారీగా పారామిలిటరీ -
ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్ 16న ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement