అమ్మాయి.. అమెరికా నుంచి రాగానే చెట్టుతో పెళ్లి!

27 Jun, 2022 15:02 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 


పోస్టుల వరకే...

అమెరికా కోర్టు తీర్పుకు స్పందనగా ఎన్నారై అయిన బాంద్రా (ముంబయి) అమ్మాయి ‘నా శరీరం, నా నియమాలు’ అని పోస్టులు పెడుతూవుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రులేమో ఆమె ఇక్కడికి వచ్చీరాగానే కుజదోషం పోవడానికి చెట్టుతో పెళ్లి చేయడానికి యోచిస్తూవున్నారు.
– అభిజిత్‌ గంగూలీ, కమెడియన్‌


ఇదెక్కడి సమస్య?

అత్యాచారానికి పడే శిక్ష కంటే, అత్యాచారానంతర అబార్షన్‌కు ఎక్కువ శిక్ష పడేట్టయితే– ఇంక దాన్ని మనం మహిళల మీద జరుగుతున్న యుద్ధం అనుకోవాలి.
– మహమ్మద్‌ సాఫా, యాక్టివిస్ట్‌


మన చేతుల్లో లేవు

అంటే, ఈ వారంలో అమెరికా సుప్రీంకోర్టు వైఖరిని బట్టి మనం ఇలా అనేసుకోవచ్చు: జీవితం అనేది గర్భధారణతో మొదలై, మాస్‌ షూటింగ్‌తో అంతం అవుతుందన్నమాట!
– ఆరియానా హఫింగ్‌టన్, మీడియా అధినేత్రి


అతిపెద్ద నిపుణులు

మీరు కోటీశ్వరులైనా అవండి, లేకపోతే ప్రభువులు అయినా కండి. అప్పుడు మీకు ఇంకే అర్హత లేకపోయినా మీరు కోవిడ్, గ్లోబల్‌ వార్మింగ్, జీఎంఓ లాంటి వాటిమీద మాట్లాడే నిపుణులు అయిపోతారు.
– ఎవీ డస్కాలూ, స్కిన్‌ క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌


మాయమవుతోంది

నేను 2017లో జర్మనీ బుక్‌ టూర్‌ చేస్తున్నప్పుడు, హిట్లర్‌ కాలంలో పిల్లాడిలా ఉన్న ఒక జర్మనీ పోలీస్‌ డిటెక్టివ్, ‘‘చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్యం ముందు అంగుళాల కొద్దీ మాయమవుతూ, తర్వాత వెంటనే లేకుండా పోతుంది’’ అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది నమ్మాను, ఇప్పుడు మనం చూస్తున్నాం.
– జెన్నా బ్లూమ్, రచయిత్రి


కదా!

దేవుడు ఎంత ఆలోచనాత్మకంగా కొన్నింటిని ఏర్పాటు చేస్తాడంటే– నువ్వు ఎక్కడైతే పుడతావో, ఆ స్థానిక మతమే మిగిలిన అన్నింటికంటే అసలైన మతం అయి తీరుతుంది.
– రిచర్డ్‌ డాకిన్స్, బయాలజిస్ట్, రచయిత


రెండూ జతగా...

పిల్లలన్నాక ఏడుస్తారు. విమానంలో పిల్లలు ఏడవడంలో మీకు సమస్య ఉంటే దాన్ని ఎదుర్కోక తప్పదు. అంతేగానీ తల్లివైపు తేరిపార చూడటం, ‘ప్చ్‌’ అని పెదవులు ఆడించడం వల్ల లాభం లేదు. గుక్కపెట్టి ఏడ్చే పిల్లల్ని ఊరడించే తల్లులను మీరు అలా చూసేట్టయితే ఏ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టూ వాడకపోతే మంచిది. ఈ అంకుల్స్‌ ఇయర్‌ఫోన్స్‌ లేకుండా వీడియోలు, రీల్స్‌ చూస్తుంటారుగానీ పసిపిల్లలు మాత్రం ఏడవకూడదంట!
– నిశా సుబ్రమణియం, టీచర్‌


ఒప్పుకోవాలి

ఎమర్జెన్సీ, ‘1984’... ఈ రెండు తప్పులనూ కాంగ్రెస్‌ అంగీకరించి ముందుకు సాగాలి. అయితేలూ, కానీలూ వద్దు.
– అశోక్‌ స్వైన్, ప్రొఫెసర్‌

మరిన్ని వార్తలు