ఏరో ఇండియా షో : నింగినంటే సంబరం 

2 Feb, 2021 10:29 IST|Sakshi

రేపటి నుంచి బెంగళూరులో ప్రదర్శన

సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనకు బెంగళూరు యలహంక వైమానిక స్థావరం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అలరించే ఈ ఆకాశ వేడుక ఈ నెల 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఏరో షో జరిగే ప్రదేశం చుట్టుపక్కల 45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రదర్శనల్లో దుర్ఘటనలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆకస్మికంగా ప్రమాదాలు, హాని జరగకుండా తప్పించేందుకు గ్రిడ్, సబ్‌ గ్రిడ్, మైక్రో గ్రిడ్‌లుగా విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ప్రదర్శనలో రెండు సూర్యకిరణ్‌ విమానాలు ఆకాశంలో విన్యాసాల సమయంలో ఢీకొని కూలిపోవడం, పార్కింగ్‌ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు కాలిపోవడం వంటి దుర్ఘటనలు సంభవించాయి. 

600 పైగా ప్రదర్శనలు.. 
ఈ కార్యక్రమంలో 600లకు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. గతేడాది 22 దేశాల నుంచి ప్రదర్శనలు వచ్చాయి. కాగా కోవిడ్‌ కారణంగా ఈసారి 14 దేశాలకు మాత్రమే అనుమతి లభించింది. సందర్శకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. వైమానిక రంగంలో నూతన ఆవిష్కారాలను చాటేలా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి.

మరిన్ని వార్తలు