No 7 Days Quarantine: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్‌లో ఉండక్కర్లేదు!

10 Feb, 2022 13:54 IST|Sakshi

ఒమిక్రాన్‌ వేరియంట్‌తో  ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్‌ -19 వైరస్‌ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

కొత్త మార్గదర్శకాలు...

  • విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్‌లైన్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి
  • తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను కూడా అప్‌లోడ్ చేయాలి.
  •  రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.
  • వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి.
  • ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి.

"ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నివేదిక లేదా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్‌కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్‌ ప్రోటోకాల్‌ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

(చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే)

>
మరిన్ని వార్తలు