ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం

26 Aug, 2021 12:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాలపై గురువారం అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలను ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేవానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్‌ని భారతీయులను, మైనారిటీ హిందువులు, సిక్కులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరింస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్‌పై పడే ప్రభావంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు

మరిన్ని వార్తలు