సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్‌ నేత.. గులామ్‌ నబీ బాటలో మరో నేత!

21 Aug, 2022 14:27 IST|Sakshi

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని వరుస షాక్‌లు తగులుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ(69).. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ట్విస్ట్‌ ఇచ్చారు. తాను.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

ఈ మేరకు ఆనంద్‌ శర్మ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నా ఆత్మగౌరవంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. దీంతో, సోనియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: బీజేపీ సంచలన నిర్ణయం.. ఉమాభారతి సన్నిహితుడికి షాక్‌!

మరిన్ని వార్తలు