1985లో టెన్త్‌ పాసై.. 2023లో పీయూసీ రాసి.. స్ఫూర్తినిస్తున్న ఆటో డ్రైవర్‌!

29 Aug, 2023 11:09 IST|Sakshi

బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్‌ ఇటీవల ఎక్స్‌(ట్విట్టర్‌)లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ ట్వీట్‌ చేశారు. ఆటో డ్రైవర్‌ భాస్కర్‌తో తనకు ఎదురైన అద్భుత అనుభవాన్ని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. భాస్కర్‌ ఇటీవలే తన ప్రీ- యూనివర్శిటీ(పీయూసీ) పరీక్ష రాశారని తెలిపారు. నిధి తన పోస్టులో ఆటో డ్రైవర్‌ భాస్కర్‌ 1985లో స్కూలు మానివేసినప్పటి నుంచి ఉన్నత విద్య చదవాలనే తపనతో ఉన్నారన్నారు. 

ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఒక ఫొటోతో పాటు నిధి అగర్వాల్‌ ఇలా రాశారు ‘ఈరోజు ఓలాక్యాబ్స్‌ ఆటో ద్వారా భాస్కర్‌ పరిచయం అయ్యారు. ఈ రోజే ఆయన పీయీసీ పరీక్షలోని ఆంగ్ల ప్రశ్నాపత్రం రాశారు. భాస్కర్‌ 1985లో 10వ తరగతి పాసయ్యాక ఈ ఏడాది పీయూసీ పరీక్ష రాశారు. భాస్కర్‌ పిల్లలు స్కూలులో చదువుతున్నారు. భాస్కర్‌కు చదువుపై ఉన్న శ్రద్ధ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది’ అని రాశారు. 

నిధి అగర్వాల్‌ అందించిన ఈ పోస్టు ఇంటర్నెట్‌లో సందడి చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ పోస్టుకు 1,500కు మించిన వీక్షణలు దక్కాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఇటువంటి అనేక కథలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. 
ఇది కూడా చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్‌ తలాక్‌!
 

మరిన్ని వార్తలు