కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్‌..! వీడియో వైరల్‌..

30 Jul, 2023 18:45 IST|Sakshi

ఏ జంతువైనా తమ బిడ్డలను తప్పా ఇంకే జంతువు పిల్లలను దగ్గరికి తీసుకోవు. అంతేకాదు.. పొరబడి వచ్చినా.. తమ పిల్లలు కాదని గుర్తించి దాడి చేస్తాయి. అందునా వేరే జాతి జంతువు పిల్లలనయితే.. అసలే దగ్గరికి రానియ్యవు. కానీ మీరు చూడబోయే ఈ వీడియోలో ఓ కోతి పిల్లను అక్కున చేర్చుకుంటుంది పిల్లి. వేరే జాతి జంతువు పిల్లను ఓ పిల్లి దగ్గరికి తీసుకుని పోషించడం గ్రేట్ కదా..?

వీడియో ప్రకారం.. ఓ కోతి పిల్ల తన తల్లి నుంచి దూరమవుతుంది. దీంతో ఓ పిల్లి కోతి పిల్లను దగ్గరికి తీసుకుంటుంది. తన సొంత తల్లిపై ఎక్కినట్లు పిల్లి బొజ్జకు హత్తుకుని కూర్చుంటుంది కోతి పిల్ల. ఇక.. ఆ కోతి పిల్లని బరువని భావించక.. తనతో పాటే మోసుకుపోతుంది పిల్లి.

ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ ట‍్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. తెలివి ఉన్న మనుషులే ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే ఈ రోజుల్లో ఈ పిల్లి అందరికీ ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తోందంటూ మరో యూజర్ ట‍్వీట్ చేశాడు. 

ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్‌..

మరిన్ని వార్తలు