బుల్‌డోజర్‌కు అడ్డు నిలబడి.. ఒంటికి నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు

12 Oct, 2022 15:07 IST|Sakshi

బెంగళూరులో భార్యభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుగుపొరుగు వారు, పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి వాళ్లను నిప్పంటించుకోకుండా ఆపగలిగారు. మహిళ చేతిలోనుంచి అగ్గిపెట్టె లాక్కుని బకెట్లతో నీళ్లు పోశారు. భర్తను కూడా పోలీసులు పట్టుకుని ఆపారు. అనంతరం భార్యాభర్తలపై ట్యాంకర్‌తో నీళ్లు పోశారు. క్షణం ఆలస్యమైన వారు అగ్నికి ఆహుతయ్యుండేవారు.

ఏం జరిగిందంటే?
బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఆర్‌ పురంలోని ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో మురికి కాలువ పక్కనే నిర్మించిన అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్‌డోజర్‌తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులపైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. బుల్‌డోజర్‌కు ఎదురుగా నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు ఉన్నాయని భార్యాభర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇది కచ్చితంగే అక్రమంగా కట్టిందే అని పేర్కొన్నారు. మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై దీన్ని నిర్మించారని తెలిపారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం: కదులుతున్న డొంక

మరిన్ని వార్తలు