Banned Apps: కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం

22 Jul, 2022 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్లీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బ్లాక్‌ చేసిన యాప్‌లు పేర్లు మార్చుకుని కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నట్లు తమ మంత్రిత్వ శాఖకు నివేదికలు, ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు.
చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

ఈ ఫిర్యాదులను తదుపరి పరిశీలన కోసం తాము హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను బ్లాక్‌ చేయాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్స్‌ అయిన గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నిషేధిత యాప్‌లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను బ్లాక్‌ చేయవలసిందిగా టెలికమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు