బీఈసీఐఎల్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

28 Aug, 2021 19:02 IST|Sakshi

భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌–ఎన్‌సీఆర్‌ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (బ్యాంకు జాబ్‌ ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్‌ న్యూస్‌)

► మొత్తం పోస్టుల సంఖ్య: 10
► పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌–04, కన్సల్టెంట్‌–03, జూనియర్‌ కన్సల్టెంట్‌–03

► సీనియర్‌ కన్సల్టెంట్‌: విభాగాలు: ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/టెక్నాలజీ, లా. అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.80,000 వరకు చెల్లిస్తారు.

► కన్సల్టెంట్‌: విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ /టెక్నాలజీ. అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.60,000 వరకు చెల్లిస్తారు.

► జూనియర్‌ కన్సల్టెంట్‌: విభాగాలు: ఐటీ, ఓఎల్‌. అర్హత: విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: పోస్టును అనుసరించి నెలకు  రూ.30,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021

► వెబ్‌సైట్‌: www.becil.com


ఐహెచ్‌బీటీలో 17 ఖాళీలు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ(ఐహెచ్‌బీటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం పోస్టుల సంఖ్య: 17

► పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌–10, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, టెక్నికల్‌ అసిస్టెంట్‌–07.

► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ/ఎంఫార్మా/ఎండీ(ఆయుర్వేద)/ఎంవీఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

►  వయసు: 28–40ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.49,000 నుంచి రూ.1,08,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

► వెబ్‌సైట్‌: https://www.ihbt.res.in/en/

మరిన్ని వార్తలు