-
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్‌గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్‌లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్‌ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్‌గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్‌ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
నిజంగానే..చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు! ఇంట్రస్టింగ్ స్టోరీ
చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఒక వ్యక్తి అక్షరాలా దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృతజ్ఞతతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు. అదీ రామాయణం స్ఫూర్తితో. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌనక్. తాను కూడా అమ్మకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించి, దానితో తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి తల్లి పాదాలపై మోకరిల్లాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌనక్ క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాడట. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు. తన చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదంటూ రౌనక్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement