ఆ పోలీస్‌కు భార్యంటే భయం! అందుకే..

11 Dec, 2020 18:05 IST|Sakshi
కానిస్టేబుల్‌ రాసిన లేఖ

భోపాల్‌ : సెలవు కోసం ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా‌ మారింది. తన భార్య తమ్ముడి పెళ్లికి వెళ్లడానికి అనుమతి కోరుతూ రాసిన ఆ లేఖ ఓ వైపు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంటే.. మరోవైపు ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్‌ కుమార్‌ అహిర్‌వార్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ తన భార్య తమ్ముడి పెళ్లికి వెళ్లటానికి అనుమతి కోరుతూ డిసెంబర్‌ 7వ తేదీన డీఐజీకి ఓ లేఖ రాశారు.  డిసెంబర్‌ 11వ తేదీనుంచి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయని అందుకోసం 5 రోజులు సెలవు కావాలని కోరాడు. ‘నా తమ్ముడి పెళ్లికి రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి’ అని తన భార్య హెచ్చరించిందని, అడిగినన్ని రోజులు సెలవులు మంజూరు చేసి భార్య ఆగ్రహంనుంచి కాపాడాలని వేడుకున్నాడు. ( భర్తపై ఎనలేని ప్రేమ.. 41 ఏళ్లుగా)

భార్య హెచ్చరికను ఆ లేఖలో హైలెట్‌ చేశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ లేఖపై సీరియస్‌ అయ్యారు. అతడిపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. దీనిపై ఓ సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ అతడు ప్రత్యేకమైన కారణాలు చెప్పి గత కొన్ని నెలలుగా సెలవులు తీసుకుంటూనే ఉన్నాడు. 11 నెలల్లో దాదాపు 55 సెలవులు తీసుకున్నాడు’’ అని చెప్పారు. ( 8 ఏళ్లుగా డేటింగ్‌, పెళ్లి కావాలంటూ కోర్టుకు..)

మరిన్ని వార్తలు