ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా ‘75 ఏళ్ల ఉత్సవాలు’

9 Mar, 2021 04:40 IST|Sakshi

ఉన్నత స్థాయి కమిటీ భేటీలో ప్రధాని

న్యూఢిల్లీ: స్వాతం త్య్రం సిద్ధించి వచ్చే ఏడాదికి 75 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో అసాధ్యమనుకున్న కొన్ని లక్ష్యాలను సు సాధ్యం చేసేందుకు దేశం కొన్ని సాహ సోపేత నిర్ణయాలు తీసుకోనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా 75 ఏళ్ల ఉత్సవాలు సాగాలని ఆయన నొక్కి చెప్పారు. ‘75 ఏళ్ల స్వతంత్ర భారతావని’ని పురస్కరించుకుని జరిపే ఉత్సవాలకోసం ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నతస్థాయి జాతీయ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించాలని కోరారు.

ఈ కార్యక్రమాలను ‘స్వాతంత్య్ర పోరాటం, 75 ఏళ్ల ఆదర్శాలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల కార్యాచరణ, 75 ఏళ్ల సంకల్పం’అనే ఐదు ఉప శీర్షికల కింద విభజించాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ప్రజా భాగస్వామ్యంతో జరిపే ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆలోచనలు, భావనలు, సూచనలు, కలలే కేంద్రంగా సాగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి సూచనలు, సలహాలు ఇచ్చిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కాంగ్రెస్‌ నేత ఖర్గే, బీజేపీ చీఫ్‌ నడ్డా తదితరులున్నారు.  ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో వారానికొక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలను చేపడతారు. దేశ వ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలను, నిర్మాణాలను ఎంపిక చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12న గుజరాత్‌ నుంచి ప్రధాని మోదీ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను ప్రారంభించనున్నట్లు గుజరాత్‌ సీఎం రూపానీ వెల్లడించారు.

నారీశక్తికి ఇవే నిదర్శనాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రధాని మోదీ వినూత్నంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మహిళల వ్యాపారదక్షత, సృజనాత్మకత, భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పలు ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ‘నారీశక్తి’ హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఆయా ఉత్పత్తుల విశిష్టతను వివరించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సాధనకు మహిళలు ముందు వరుసలో నిలిచారని ట్విట్టర్‌లో కొనియాడారు.  మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు