హిందూపురం: బాలకృష్ణ గోబ్యాక్‌..

9 Mar, 2021 04:46 IST|Sakshi
వెనుతిరిగి వెళ్లిపోతున్న బాలకృష్ణ

మోత్కుపల్లిలో వెనక్కు పంపిన ప్రజలు

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన 21వ వార్డు మోత్కుపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా.. స్థానికులు గోబ్యాక్‌ బాలకృష్ణ.. అంటూ వెనక్కు పంపించారు. సాయంత్రం 4 గంటల సమయానికి ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మారుతీరెడ్డిల ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే బాలకృష్ణతో పాటు స్థానిక టీడీపీ నాయకులు గత ఆదివారం ఇదే ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.

తిరిగి సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకోవడంతో స్థానికులతో పాటు వైఎస్సార్‌సీపీ వారు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీకి కేటాయించిన సమయంలో మీరెలా ప్రచారానికి వస్తారని నిలదీశారు. గోబ్యాక్‌ బాలకృష్ణ.. జై జగన్‌.. అంటూ నినదించారు. ఈ సందర్భంగా వైఎస్సా ర్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు సర్దిచెప్పారు. బాల కృష్ణ ప్రచారానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు