Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!

18 Dec, 2023 05:05 IST|Sakshi

స్థానిక మందిరాల్లోనే పూజలు చేయండి: నిర్వాహకులు

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి            కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్‌ సిటీ’ని నిర్మిస్తున్నారు.

ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి
అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్‌ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్‌ గాజియాబాద్‌లోని దుధేశ్వర్‌ వేద్‌ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు.

>
మరిన్ని వార్తలు