విజేత సీజేఐ ఎలెవెన్‌

4 Apr, 2022 05:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆదివారం టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. మోడర్న్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో సీజేఐ ఎలెవెన్, ఎస్‌బీఏ ఎలెవెన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన సీజేఐ–ఎలెవన్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సందర్భంగా సుప్రీం బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) ప్రెసిడెంట్‌ వికాస్‌ సింగ్‌ వేసిన కొన్ని బంతులను సీజేఐ ఆడారు. సీజేఐ ఎలెవన్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎస్‌సీబీఏ ఎలెవెన్‌ జట్టు 12.4 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది.

మరిన్ని వార్తలు