వీడియో: అబ్బా..! దళిత స్వామిజీతో ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్‌

23 May, 2022 10:21 IST|Sakshi

మనసులో అవతలి వాళ్ల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. బహిరంగ వేదికల్లో మాత్రం లేనిపోని ప్రేమలు ఒలకబోయడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి ఘటనే ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అవతలివాళ్ల పట్ల, అదీ ప్రత్యేకించి దళితుల పట్ల తన సోదరభావం ఏపాటిదో చూపించే ప్రయత్నంలో..  ఓ ఎమ్మెల్యే చేసిన పని చర్చనీయాంశంగా మారింది. 


బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌.. ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి  ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత బయటకు ఉమ్మించి.. తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు. 

దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ఈ చేష్టలకు దిగారు. తమ మధ్య  కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడాయన. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో గా హాలును మారుమోగించారు. ఆదివారం చామరాజ్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు ఎమ్మెల్యే ఈ చేష్టలకు పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు