పబ్లిక్‌గా దమ్ము లాగించిన పోలీసులు

23 Dec, 2020 20:39 IST|Sakshi

టే

లక్నో: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరం. ఈ నిబంధనను ఆచరించకపోతే పోలీసులు ఫైన్‌ వేస్తారు. లేదంటే పబ్లిక్‌గా పొగ తాగినందుకు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే లాక్కెళ్లిపోతారు. మరి శిక్షించాల్సిన పోలీసులే రూల్స్‌ బ్రేక్‌ చేస్తే..! వారి పరువు గంగలో కలవడమే కాదు, ఉద్యోగం కూడా చిక్కుల్లో పడుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎస్సై రాజ్‌ బహదూర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ జితేంద్ర సింగ్..‌ పహసు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బనేల్‌ గ్రామంలో పార్టీకి వెళ్లారు. అక్కడ తీరికగా కూర్చుని ఎదురుగా టేబుల్‌ మీద మందు బాటిళ్లు పెట్టుకుని పబ్లిక్‌గా దర్జాగా దమ్ము లాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కాగా అది కాస్తా వైరల్‌గా మారింది. అలా ఈ వీడియో పై అధికారుల కంట పడింది. దీంతో ఆ ఇద్దరినీ బులంద్‌షహర్‌కు బదిలీ చేసినట్లు సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోలీసు సంతోష్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. (చదవండి:  సిస్టర్‌ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు)

చదవండి: కాబోయే భార్య ఆస్పత్రి బెడ్‌ మీద ఉండగానే..

మరిన్ని వార్తలు