covid-19 : దేశంలో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా కేసులు

6 Jun, 2021 10:28 IST|Sakshi

దేశంలో కొత్తగా 1,14,460  కరోనా పాజిటివ్‌ కేసులు

రెండు నెలల కనిష్టానికి చేరిన‌ కేసుల సంఖ్య 

న్యూఢిల్లీ: దేశవ్యా​ప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల కనిష్టానికి  కోవిడ్‌-19 కేసుల సంఖ్య చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,14,460 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్‌ కేసులు సంఖ్య 2,88,09,339 కి చేరింది. గత 24 గంటల్లో 2,677 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,46,759కి పెరిగింది. గత 24 గంటల్లో 1,89,232  మంది కోవిడ్‌ పేషెంట్లు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 2,69,84,781 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక  దేశంలో ప్రస్తుతం 14,77,799 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 23.13 మందికి వ్యాక్సినేషన్‌ అందించారు.

చ‌ద‌వండి : రెండు నెలల కనిష్టానికి.. !
 

మరిన్ని వార్తలు