సోదరిపై వేధింపులను ప్రశ్నించిన బాలుడు.. కత్తులతో పొడిచి చంపేసిన మైనర్లు

29 Oct, 2022 15:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరిపై వేధింపులకు పాల్పడటాన్ని ప్రశ్నించినందుకు ఓ 17 ఏళ్ల బాలుడిని దారుణంగా పొడించి చంపేశారు ఇద్దరు మైనర్లు. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుడు పటేల్‌ నగర్‌కు చెందిన బాలుడిగా గుర్తించారు.

వీడియో ప్రకారం.. ఓ గల్లీలో ముగ్గురు మైనర్లు గొడవ పడుతున్నారు. అందులో ఒకడు బాధితుడిని కత్తితో పలు మార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. శరీరంలో దిగిన కత్తితో బాధితుడు పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయే ముందు తన ఫోన్‌ తీసి ఎవరికో కాల్‌ చేసేందుకు ప్రయత్నించినట్ల తెలుస్తోంది. కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో ఇంటివద్దే దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఎంత ఘాటు ప్రేమయో.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్టూడెంట్స్‌.. చివరకు..

మరిన్ని వార్తలు