Delhi CM Arvind Kejriwa: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!

22 Nov, 2021 21:20 IST|Sakshi

ఛండీఘర్‌: సమాజంలో చాలా అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్లను సామాన్యులు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్లకి లేదా పెళ్లిళ్లకి ఆహ్వానిస్తే వాళ్లురారని అనుకుంటాం. పైగా వాళ్లు చాలా బిజీగా ఉంటారని, అందువల్ల చాలా మటుకు వాళ్లురారు అనే భావిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా పంజాబ్‌ డ్రైవర్‌ ఆహ్వానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మన్నించారు. అసలు విషయంలోకెళ్లితే...ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాబోయే శాసనసభ ఎన్నికల కోసం పంజాబ్ పర్యటన సందర్భంగా లూథియానాలో ఆటో రిక్షా డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే ఆ పర్యటనలో ఒక ఆటో డ్రైవర్‌ తన ఇంటికి భోజనానికి రండి అంటూ కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తాడు.

(చదవండి: హ్యాట్సాఫ్‌ సార్‌!... హీరోలా రక్షించారు!)

దీంతో కేజ్రివాల్‌ అతని ఆహ్వానానికి ఎంతగానో మురిసిపోయి తప్పకుండా వస్తానని హామీ కూడా ఇచ్చారు. అంతేకాదు కేజ్రీవాల్‌తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ భగవంత్ మాన్, ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా కూడా ఆటో రిక్షా డ్రైవర్ ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఈ విషయంతో పాటు "ఈ రాత్రి డిన్నర్‌కి తప్పకుండా వెళతాం" అనే క్యాప్షన్‌ని జోడించి మరి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: జనరల్‌నాలెడ్జ్‌ ఉంటే చాలు... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోగలం!!)

మరిన్ని వార్తలు