రికార్డు సృష్టిస్తున్న మునక్కాయ ధరలు.. ఏకంగా..

8 Dec, 2021 16:49 IST|Sakshi

కూరగాయల రేట్లు జనానికి వణుకు పట్టిస్తున్నాయి. శీతాకాలంలో చలితో పాటు.. ధలు పోటీ పడుతున్నాయి. కొన్నివెజిటేబుల్స్‌ అయితే.. నాన్‌ వేజ్‌తో పాటీ పడుతున్నాయి. ఇలా పలు రకాలైన కూరగాయల ధరలు ఆకాశాన్నంటతున్నాయి. ఇప్పటికే బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సెంచరీ దాటిన టమాటా ధరలు ఇప్పుడిప్పుడే కొద్ది మేర తగ్గుముఖం పడుతుండగా.. తాజాగా మునక్కాయ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

సాక్షి, బెంగళూరు: శుభకార్యాల్లో మునక్కాయ చారు లేకుంటే ఏం బాగుంటుంది? అందువల్లే పెళ్లిళ్ల సీజన్‌ వస్తే మునగ ధర చెట్టెక్కి కూర్చుంటుంది. చిక్కబళ్లాపుర మార్కెట్లో కేజీ మునక్కాయలు రూ. 400 ధర పలుకుతున్నాయి. కానీ కొనుగోళ్లు తగ్గడం లేదు. చలి కాలం కావడం, పెళ్లిళ్లు ప్రారంభం కావడంతో మునగకు డిమాండ్‌ పెరిగింది. అతివృష్టి వల్ల జిల్లా చుట్టుపక్కల మునగ పంట దెబ్బతినింది. దీంతో వ్యాపారులు పూణె నుంచి తెప్పిస్తున్నారు. ఎంత ధరయినా కొనడం తప్పదని కొందరు అన్నారు. 

చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి)  

మరిన్ని వార్తలు