డిసెంబ‌ర్ నుంచి లాక్‌డౌన్‌: ఇందులో నిజ‌మెంత‌?

12 Nov, 2020 20:22 IST|Sakshi

న్యూఢిల్లీ: సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగాక క‌రోనా క‌న్నా స్పీడుగా ఫేక్ న్యూస్ విస్త‌రిస్తోంది. క‌రోనాను పూర్తిగా నిలువ‌రించే మందు లేన‌ట్టే ఈ ఫేక్ న్యూస్ బెడ‌ద‌ను నివారించేది కూడా ఏదీ లేదు. పైగా లాక్‌డౌన్ కాలంలో అస‌త్య వార్త‌లు సీజ‌నల్‌ వ్యాధుల క‌న్నా ప్ర‌బ‌లంగా వ్యాపించాయి. తాజాగా అంద‌రినీ కంగారు పెడుతూ మ‌రో పుకారు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌నందున డిసెంబ‌ర్ 1 నుంచి దేశ‌వ్యాప్తంగా మ‌రోసారి లాక్‌డౌన్ విధిస్తార‌ట‌. ఈ మేర‌కు ఓ ట్వీట్ అంద‌రినీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంది. (చ‌ద‌వండి:వైర‌ల్‌: వందేళ్ల‌ కింద‌టి శ‌వం న‌వ్వుతోందా?)

అయితే మ‌ళ్లీ లాక్‌డౌన్ అనే వార్త‌ను ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. స‌ద‌రు ట్వీట్ మార్ఫింగ్ చేసిన‌ట్లు  ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) వెల్ల‌డించింది. లాక్‌డౌన్ విధింపు గురించి ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో ఏది కంట ప‌డ్డా గుడ్డిగా న‌మ్మేయ‌కండి. ఇలాంటి అస‌త్య వార్త‌ల‌ను ఇత‌రుల‌కు షేర్ చేయ‌కండి. కాగా దేశంలో ప్ర‌స్తుతం అన్‌లాక్ 5.0 మార్గ‌ద‌ర్శ‌కాలు కొన‌సాగుతున్నాయి. (చ‌ద‌వండి: అంద‌రి కోసం..దేశం చూసొద్దాం పద)

నిజం: డిసెంబ‌ర్ 1 నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న‌ట్లు కేంద్రం ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

మరిన్ని వార్తలు