జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. ఎంకరేజ్ చేసిన అబ్బాయిలు.. వీడియో వైరల్‌

30 Jan, 2023 19:02 IST|Sakshi

స్కూల్‌లో అబ్బాయిలు అప్పుడప్పుడు స్నేహితులతో గొడపడుతుంటారు. మాటా పెరిగి ఒక్కోసారి పోట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. అమ్మాయిల మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అసలు ఎలాంటి గొడవల జోలికి వెళ్లరు.

కానీ ఇప్పుడు ట్రెండు మారింది. అమ్మాయిలే ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఒకరిపైఒకరు దాడి చేసుకుంటూ సినిమా రేంజ్‌లో పోట్లాటకు దిగుతున్నారు. కారణమేదైనా ఒక్కోసారి సీరియస్‌గా ఫైట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్కూల్ డ్రెస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఫుట్‌పాత్‌పైనే రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ ఫైటింగ్ చేస్తూ తోసేసుకుని కిందపడ్డారు. చుట్టుపక్కన ఉన్న వాళ్లు వీళ్లనే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అబ్బాయిలైతే అరుపులు, కేకలు వేస్తూ ఫైటింగ్‌ను ఎంకరేజ్ చేశారు. చివరకు అక్కుడున్న ఒకరు జోక్యం చేసుకుని పైటింగ్‌ను ఆపారు.

ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. ఈ అమ్మాయిలు బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించారని, పాప్‌కార్న్ తింటూ వీరి ఫైటింగ్ చూసి ఎంజాయ్ చేసినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
చదవండి: స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు