శాంతి భద్రతలను పోలీసులు గాలికి వదిలేశారు: గవర్నర్‌

19 Sep, 2020 19:20 IST|Sakshi

కలకత్తా: పశ్చిమ బెంగాల్ అక్రమ బాంబుల తయారీకి నిలయంగా మారిందని గవర్నర్ జగదీప్‌ దంఖర్‌  మమతా బెనర్జీ ప్రభుత్వంపై  శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం కేరళ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో ఎన్‌ఐఏ ఆపరేషన్‌ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉగ్రవాదుల ద్వారా భారత్‌లో స్థావరం ఏర్పాటు చేయడానికి ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా చేసిన ప్రయాత్నాలకు అడ్డుకట్ట వేయడంలో ఎన్‌ఐఏ ఆపరేషన్‌ విఫలమైన అనంతరం గవర్నర్..‌ దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలోని పలు చోట్ల శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 'ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే అక్రమ బాంబుల తయారీకి రాష్ట్రం నిలయంగా మారింది' ఇది ప్రజాస్వామ్యాన్ని కూల్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటూ గవర్నర్‌ వరుసగా ట్వీట్స్‌‌ చేశారు.

ప్రతిపక్షాలపైనే దృష్టి పెడుతూ, రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ తప్పిదాలు చేయడంలో మమతా అధికార పోలీసులు బిజీగా ఉన్నారని గవర్నర్‌ ఆసహనం వ్యక్తం చేశారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతల భయంకర క్షీణతకు కారణమవుతున్న రాష్ట్ర ఉన్నతాధికార పోలీసులు వారి జవాబుదారీతనం నుండి తప్పించుకోలేరని' హితవు పలికారు. మరొక ట్వీట్‌లో పశ్చిమ బెంగాల్‌ డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి బాధాకరమని, రాష్ట్రంలో జరిగే అక్రమాలు పట్టనట్టుగా చూస్తున్న డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి నిజంగా ఆందోళన కలిగించే విషయమన్నారు.

మరిన్ని వార్తలు