నెటిజన్ల వ్యాఖ్యలపై మండిపడ్డ గుత్తా జ్వాల

12 Feb, 2021 20:31 IST|Sakshi

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. ఈ విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ట్విటర్‌లో తన అమ్మమ్మ మరణ వార్తను తెలుయజేస్తూ.. "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. అంతకుముందు అమ్మ ప్రతి నెలా చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ పోస్ట్‌ చేసింది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు.. చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు.

దీనిపై బాధతో ఆమె స్పందిస్తూ.. ఓపక్క అమ్మమ్మను కోల్పోయిన బాధలో మేముంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. అసలు మనం బతుకుతున్నది సమాజంలోనేనా.. అలాగైతే సానుభూతి ఎక్కడ.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ ఆమె ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు