Sushant Singh Death: ఒక్కసారి నాకు కాల్‌ చేసి ఉంటే.. కంటతడి పెట్టుకున్న స్మృతి ఇరానీ

28 Mar, 2023 19:05 IST|Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి దాదాపు మూడేళ్లు కావోస్తుంది. 2020 జూన్‌ 14l ముంబై బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీలానే ఉంది. నటుడి మృతిని సెలబ్రిటీలు, అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. నేటికి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉన్నారు. సుశాంత్‌ అకాల మరణంపై తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. 

స్మతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత టీవీ సీరియల్స్‌, పలు సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సుశాంత్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ముంబైలో టీవీ షోలలో పనిచేయడంతో అతనితో ఆమెకు మంచి బంధం ఉంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేంద్ర మంత్రి..సుశాంత్  మరణించినప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

‘సుశాంత్ సింగ్ మరణం గురించి తెలిసినప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. ది స్లో కాన్వర్సేషన్‌లో నీలేష్ మిశ్రాతో  మాట్లాడుతున్నాను. సుశాంత్ మరణ వార్త తట్టుకోలేక పోయాను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వెంటనే ఆ కాన్ఫరెన్స్ ఆపేశాను. మరణించే ముందు సుశాంత్‌ నాకు ఎందుకుఫోన్‌ చేయలేదని బాధపడ్డాను. ఒకవేళ చేసి ఉంటే.. మిమ్మల్ని మీరు బలవంతంగా చంపుకోవడం ఆపండి అని చెప్పాలి అనుకున్నాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. 

తరువాత సుశాంత్‌ సహానటుడు, స్నేహితుడు అమిత్ సాద్‌కి కాల్ చేసి మాట్లాడినట్లు స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. సుశాంత్ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలో అమిత్‌ కూడా షాక్‌లో ఉన్నాడని, సుశాంత​ తనకు జీవించడం ఇష్టం లేదని తనతో చెప్పినట్లు అమిత్‌ చెప్పాడని పేర్కొన్నారు.  కనీసం ఒక్కసారయినా తనకు ఫోన్ చేసే సుశాంత్‌.. ఆత్మహత్య చేసుకునేముందు ఎందుకు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు