మనిషి పుర్రెతో విమానం ఎక్కబోయిన సాధ్వీ

9 Sep, 2021 15:43 IST|Sakshi

భోపాల్‌: ఓ సాధ్వీ మ‌నిషి పుర్రె, ఎముక‌లు ఉన్న బ్యాగ్‌తో విమానం ఎక్క‌బోయి అధికారులకు దొరికిపోయింది. ఈ ఘటన ఇండోర్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్వీ యోగ్‌మాతా స‌చ్‌దేవ్ అనే మ‌హిళ‌.. ఉజ్జ‌యినీ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండోర్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చింది. ఈ క్రమంలో లగేజ్ స్కానింగ్‌ వద్ద భద్రతా సిబ్బంది ఆమె బ్యాగ్‌ తనిఖీ చేయగా..  అందులో పుర్రె, ఎముకలు కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు.

అనంతరం సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌కి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై విచారణ జరపగా.. గంగలో నిమజ్జనం కోసం తన తోటి సన్యాసి అస్తికలను హరిద్వార్‌కు తీసుకువెళుతున్నట్లు చెప్పింది. దీంతో ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్ వాటిని తీసుకుని ప్రయాణించడం కుదరదని ఆమెను ఆపేశారు. చివరికి వాటిని వేరే సాధువులకి ఇచ్చి రోడ్డు మార్గం ద్వారా హరిద్వార్‌కు పంపి, సాధ్వీ  మరొక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.

చదవండి: ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్‌!

మరిన్ని వార్తలు