ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో అగ్రస్థానానికి భారత్‌

19 Apr, 2021 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు కీలకమైన లిథియం అయాన్‌ బ్యాటరీలను వచ్చే అరు నెలల్లో దేశీయంగానే పూర్తి స్థాయిలో తయారీ చేయగలమని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో భారత్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి ఎదగగలదని ఆయన పేర్కొన్నారు. ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌. నిర్వహించిన సంభవ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు వివరించారు. మరోవైపు, హైడ్రోజన్‌ ప్యూయల్‌ సెల్‌ (హెచ్‌ఎఫ్‌సీ), టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రూ.8 లక్షల కోట్లుగా ఉన్న క్రూడాయిల్‌ దిగుమతుల భారం వచ్చే  4-5 ఏళ్లలో రెట్టింపయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

చదవండి: 

ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు!

మరిన్ని వార్తలు