India Covid Updates: దేశంలో కరోనా టెన్షన్‌ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్‌ కేసులు

21 Jul, 2022 13:07 IST|Sakshi

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్దిరోజలుగా తగ్గుముఖం పట్టిన కేసులు బుధవారం అన్యూహంగా పెరిగాయి. దీంతో, ఆందోళన నెలకొంది. 

కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా​ నుంచి 18,294 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 1,48,881 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాపంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,25,185కు చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,25,870కి చేరింది. వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,31,50,434 చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200.91 కోట్లు వ్యాక్సిన్‌ డోసులను అందించారు. బుధవారం ఒక్కరోజే 29,12,855 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1,13,588 మందికి వైరస్​ సోకగా.. 367 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకగా.. 125 మంది మరణించారు.

మరిన్ని వార్తలు