బీరువాల్లో నోట్ల కట్టలు.. లెక్కించేందుకు నాలుగు రోజులు.. రూ.1000 కోట్ల పన్ను ఎగవేత?

27 Dec, 2021 14:12 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీల్లో భాగంగా పీయూష్‌ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే దాదాపు నాలుగు రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: ఒమిక్రాన్‌ అప్‌డేట్స్‌: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ

ఇక, సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, దిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేలింది. కన్నౌజ్‌లో పీయూష్‌ జైన్‌ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను అధికారులు గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయని సమాచారం. పన్ను ఎగవేత మొత్తంగా 1000కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
చదవండి: ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు
సంబంధిత వార్త: గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్‌లో అధికారులు.. ఫోటోలు వైరల్‌!

మరిన్ని వార్తలు