పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గడ్డకట్టిన కులూ జలపాతం

10 Jan, 2023 07:13 IST|Sakshi

సిమ్లా: కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురవడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో నీరు గడ్డకట్టుకుపోతోంది.

హిమాలయాలకు సమీపంలోని హిమాచల్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్‌ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డకట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. 

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో అతి శీతల వాతావరణంతో గడ్డకట్టిన జలపాతం 

ఇదీ చదవండి: Joshimath: కుంగుతున్నా వదలట్లేదు

మరిన్ని వార్తలు