వావ్‌.. 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్‌ లడ్డూలు..

27 Mar, 2021 15:51 IST|Sakshi
హరప్పాలో బయటపడ్డ లడ్డూలు

న్యూఢిల్లీ : అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన హరప్పాలో నివసించిన ప్రజలు లడ్డూలు తినే వారన్న సంగతి తెలిసిందే. 2017లో జరిపిన తవ్వకాల్లో 7 లడ్డూలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోధుమ రంగులో ఉన్న ఈ లడ్డూలు ఒకే సైజును కలిగి ఉన్నాయి. వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి క్రీస్తు పూర్వం 2500 సంవత్సరానికి చెందినవని తేల్చారు. ఈ లడ్డూలపై జరిపిన పరిశోధనలకు సంబంధించిన నివేదిక ఒకటి తాజాగా వెలువడింది. దీనిపై పురావస్తు శాస్త్రవ్తేత ఆగ్రిహోత్రి మాట్లాడుతూ.. వాటిపై భాగం బాగా గట్టిపడటంతో ఇంత కాలం పూర్తిగా పాడవకుండా ఉన్నాయని అన్నారు.  

వీటిపై నీళ్లు పడినపుడు వాటి రంగు మారుతోందని తెలిపారు. ఈ లడ్డూలు అన్నీ బార్లే, గోధుమ, బఠాణీలు మరికొన్ని తృణ, పప్పు ధాన్యాలతో తయారు చేశారని, ఈ విషయం మైక్రోస్కోపిక్‌ పరిశోధనల్లో తేలిందని వెల్లడించారు. వ్యవసాయ ఆధారితులైన హరప్పా ప్రజలు అత్యధిక మాంసపుకృతులు కలిగిన పదార్ధాలను ఆహారంగా తీసుకునేవారన్నారు. రెండు ఎద్దు బొమ్మలు, ఓ ఆయుధంతో పాటు ఈ లడ్డూలు దొరికాయని చెప్పారు. హరప్పా ప్రజలు వీటిని కొన్ని రకాల పూజల కోసం వాడేవారని పేర్కొన్నారు.

చదవండి, చదివించండి  : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం..

బైకర్‌ను ఆపిన పోలీస్‌.. చేతులెత్తి దండం పెడతారు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు