అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం

10 Dec, 2022 15:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింధగి సీఐ రవి, అతని భార్య మధు అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య ముగిసాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న పిల్లలు అమ్మా,నాన్న..ఇక సెలవు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

వీడ్కోలు పలుకుతున్న సీఐ దంపతుల పిల్లలు   

వారి కడ చూపు కోసం తరలివచ్చిన జనంతో సీఐ రవి స్వగ్రామం హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా రట్టిహళ్లి వీధులు కిక్కిరిసాయి. గ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని పోలీసు లాంఛనాల మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. మృతదేహలకు పూలమాలలు వేసి కన్నీటి వీడ్కోలు పలికారు. 

చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం)

మరిన్ని వార్తలు