మంచి రహదారులే అతివేగానికి కారణం!: ఎమ్మెల్యే షాకింగ్‌ వ్యాఖ్యలు

22 Jan, 2023 16:40 IST|Sakshi

రోడ్డు ప్రమాదాల గురించి మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిగా రోడ్లు ఉంటే హై స్పీడ్‌కి దారితీస్తుందని, అందువల్లే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది డ్రైవర్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఈప్రమాదల్లో వారి తప్పు కూడా ప్రధానంగా ఉందని చెప్పుకొచ్చారు.

తన నియోజక వర్గంలో రహదారులు బాగా ఉన్నాయి. అందువల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. అదీగాక రహదారులు బాగా ఉంగే రయ్‌మని స్పీడ్‌గా వెళ్లిపోతారని అ‍న్నారు. ఈ మేరకు నారాయణ పటేల్‌ని విలేకరులు అధ్వాన్నమైన రోడ్లు కారణంగా తక్కువ ప్రమాదాలు జరుగుతాయా? అని ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఒక్క ఖండ్వా జిల్లాలోనే ఈ ఏడాది నాలగు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ 2017లో తన అమెరికా పర్యటనలో యూఎస్‌ రోడ్లు కంటే మధ్యప్రదేశ్‌ రోడ్లే బాగున్నాయని అన్నారు. ఆ తర్వాత 2018లో జరిగిన బహిరంగ సభలో కూడా ఇలానే పునరుద్ఘాటించడం విశేషం. 

(చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. అందుకే ఆమె నోరుమెదపరు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..)

మరిన్ని వార్తలు