Tamil Nadu Helicopter Crash: ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం

12 Dec, 2021 17:51 IST|Sakshi

భోపాల్‌: డిసెంబర్‌ 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన నాయక్‌ జితేంద్ర కుమార్‌ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్‌ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్‌ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్‌ షహీద్‌ జితేంద్ర కుమార్‌ జీ ధమందాకే కాదు.. యావత్‌ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు.

చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్‌ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం)

అనంతరం తన ట్విటర్‌ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్‌ కేసులు.. థర్డ్‌వేవ్‌ తప్పించుకోలేమా?)

కాగా, సెహోర్‌ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు