పాపులర్‌ ఫ్రంట్‌పై ఎన్‌ఐఏ గురి

30 Dec, 2022 05:39 IST|Sakshi

న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు.

పీఎఫ్‌ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, జోనల్‌ హెడ్స్, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌–ట్రైనర్స్‌తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు