మాస్క్‌ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌

26 Apr, 2021 15:35 IST|Sakshi

తిరువనంతపురం: ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటించేలా పోలీసులు, ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాస్క్‌ ధరించకుండా ఉండడంతో అతడిని చితకబాదిన సంఘటన కేరళలో జరిగింది. 

కేరళ ఆర్టీసీలో పని చేసే బస్‌ డ్రైవర్‌ అంగమలి బస్టాండ్‌లో మాస్క్‌ లేకుండా ఓ వ్యక్తి నిలబడడాన్ని గుర్తించాడు. వెంటనే కర్ర అందుకుని మాస్క్‌ ధరించని పెద్దాయనను చితక్కొట్టాడు. కాళ్లు, చేతులపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అతడి దాడితో తీవ్రగాయాలై ముసలాయన కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవడంతో నెటిజన్లు ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ తీరుపై మండిపడుతున్నారు. పెద్దాయనను మానవత్వం లేకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్‌ లేకుంటే చెప్పాలి కానీ అలా విచక్షణ రహితంగా దాడి చేయడం సరికాదని చెబుతున్నారు.

చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
చదవండి: మా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టబోం​​​​​​​

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు