Sakshi News home page

డిఫరెంట్‌ లవ్‌సోర్టీ.. చెల్లెలి ఫ్రెండ్‌ నచ్చడంతో..

Published Sun, Dec 10 2023 11:50 AM

Indore woman Changes Gender And Marry To His Lover - Sakshi

ఓ ట్రాన్స్‌జెండర్‌ పురుషుడు తన ప్రేయసిని  చట్టబద్దంగా వివాహం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి విళ్లేతే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమ్మాయిగా పుట్టిన అల్కా సోని.. తనలో పురుష లక్షణాలు ఉన్నాయని గమనించారు. సుమారు 46 ఏళ్లు అలాగే ఉన్న అల్కా.. ఇటీవల లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకొని ‘అస్తిత్వ సోని’గా పేరు మార్చుకున్నారు. అనంతరం తాను ప్రేమించి  అమ్మాయి ‘ఆస్తా’ను వివాహం చేసుకున్నారు. వీరు ఇద్దరు ప్రత్యేక వివాహా చట్టం ప్రకారం చట్టబద్ధంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.  ఆస్తా.. అస్తిత్వ సోని సోదరికి స్నేహితురాలు కావటం గమనార్హం.

తన కుటుంబ సభ్యుల సహాకారంతో శస్త్ర చికిత్స తర్వాత ఆస్తాతో వివాహం చేసుకోగలిగాని అస్తిత్వ సోని తెలిపారు. ప్రత్యేక వివాహం చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని తెలిపారు. ఇక వీరు డిసెంబర్‌ 11న సాంప్రదాయబద్ధంగా వావాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పిళ్లికి ముందే ఇండోర్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోషన్‌ రాయ్‌కి తమ పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. తమ అభ్యర్థనను ఆయన ఆమోదించినట్లు పేర్కొన్నారు.

గురువారం వారికి ఫ్యామిలీ కోర్టు నుంచి వివాహా ధ్రువీకరణ పత్రం అందినట్లు తెలిపారు. ఈ వివాహంపై అస్తిత్వ సోని, ఆస్తా ఆనందం వ్యక్తం చేశారు.  సోనీ తన ఫ్రెండ్‌ వాళ్ల అన్నయ్య అని ఆస్తా తెలిపారు. అలాగే కొన్ని రోజులకు తమ మధ్య ప్రేమ చిగురించిందని అందుకే ఇరు కుంటుంబాల అంగీకారంతోనే తాము విహహాం చేసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఇక భిన్న లింగ లక్షణాలు కలిగి ఉండి.. అనంతరం ‘లింగమార్పిడి’ చేసుకున్న వ్యక్తులు వివాహం చేసుకునే హక్కును ఇటీవల సుప్రీంకోర్టు కల్పించిన విషయం తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement