Omicron Variant: ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్‌, క్రిస్మస్‌ వేడుకలు బ్యాన్‌

22 Dec, 2021 19:23 IST|Sakshi

Christmas And New Year Gatherings Banned In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలను నిషేధించింది. అయితే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ)  అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర సమావేశాలను నిషేధించింది.  ఢిల్లీలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పైగా గత ఆరు నెలల్లో నమోదైన కేసుల కంటే ఇదే అత్యధికం. డీడీఎంఏ సూచించిన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే సమావేశాలు, వివాహాలు, ఎగ్జిబిషన్‌లు జరుపుకోవాలని ఆదేశించింది. 

(చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?)

డీడీఎంఏ విధించిన నిబంధనలు:

  • డీడీఎంఏ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలు పనిచేసేందకు అనుమతిస్తాం అని ప్రకటించింది. పైగా రెస్టారెంట్లు, బార్‌లు గరిష్టంగా 50% సీటింగ్ సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చింది.
  • ఢిల్లీ మెట్రో 100% సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించింది. పైగాఒక్కో కోచ్‌లో 30 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
  • అంత్యక్రియలు, వాటికి సంబంధించిన సమావేశాలు గరిష్టంగా 200 మందికి మాత్రమే అనుమతి.
  • ప్రజలు మాస్క్‌లు ధరించడమే కాకుండా కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా అమలు చేసే యంత్రాంగాన్ని కఠినతరం చేయాలని జిల్లా పరిపాలన అధికారుల్ని,  ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని కోరింది.
  • మాస్కులు లేని వినియోగదారులకు ప్రవేశాన్ని నిరాకరించాలని మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్లను కూడా ఆదేశించింది.
  • రానున్న రెండు వేడుకలకు ముందు కోవిడ్ ఏయే ప్రాంతాల్లో ఎంతగా వ్యాప్తి చెందిందో గుర్తించాలని జిల్లా మేజిస్ట్రేట్‌లను (డీఎం) ఆదేశించింది.
  • జిల్లా మేజిస్ట్రేట్‌లందరూ తమ పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్నిసర్వే చేసి రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి అప్రమత్తం చేయాలని ఆదేశించింది.

(చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్‌ అవుతారు!!)

మరిన్ని వార్తలు