‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’

27 Sep, 2020 15:01 IST|Sakshi

అసదుద్దీన్‌ ఓవైసీ

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం పట్ల ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జన్మస్ధాన్‌ సేవా సంఘ్‌, షాహి ఈద్గా ట్రస్ట్‌ మధ్య తలెత్తిన వివాదం 1968లో పరిష్కారమైందని, ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రార్థనా స్ధలాల చట్టం 1991 ప్రార్ధనా స్థలాల మార్పిడిని నిరోధిస్తుందని, ఈ చట్టం అమలు బాధ్యత హోంమంత్రిత్వ శాఖకు అప్పగించారని, దీనిపై కోర్టులో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని ఓవైసీ ప్రశ్నించారు. 1968 అక్టోబర్‌లో శ్రీకృష్ణ జనమ్మభూమి వివాదం పరిష్కారం కాగా మళ్లీ ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారని ఆయన నిలదీశారు.

కాగా మధుర సివిల్‌ కోర్టులో అడ్వకేట్‌ విష్ణు జైన్‌ ఈ అంశంపై దావా వేశారు. మధురలోని వివాదాస్పద భూమిలో ప్రతి అంగుళం శ్రీకృష్ణ భగవానుడి భక్తులకు, హిందువులకు పవిత్రమైనదని జైన్‌ పేర్కొన్నారు.కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని, 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించాలని కోరారు. షాహి ఈద్గా మసీదును తొలగించాలని దావాలో పొందుపరిచారు. మొగల్‌ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చివేశారని దావా ఆరోపించింది. చదవండి : సర్వ మతాలకూ సమ ప్రాధాన్యం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా