పెట్రో ఆదాయం 3.35 లక్షల కోట్లు

20 Jul, 2021 06:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రానికి రూ.3,35,746 కోట్లు సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో వచ్చిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ లోక్‌సభకు తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోల్‌ లీటరుపై రూ.19.98 నుంచి రూ.32.90, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచడంతో ఒక్క ఏడాదిలోనే 88 శాతం ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు.

సోమవారం కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈమేరకుసమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2019 ఏప్రిల్‌ 1వ తేదీన పెట్రోల్‌ రూ.77.26, డీజిల్‌ రూ.71.81, ఎల్పీజీ రూ.762 ఉండగా, ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పెట్రోల్‌ రూ.102.69, డీజిల్‌ రూ.97.20, ఎల్పీజీ రూ.887కు చేరుకున్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు