మందు బాబులూ.. అతిగా ఆశలు పెంచుకోవద్దు.. ఆ ప్రకటన నమ్మొద్దు!

19 Jul, 2022 08:33 IST|Sakshi

వైరల్‌: సోషల్‌ మీడియా వాడకం పెరిగిపోయాక.. ఏది నిజమో, ఏది అబద్ధమో ధృవీకరించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆఖరికి ఫ్యాక్ట్‌ చెక్‌ల పేరుతో చేస్తున్న ప్రయత్నాలు సైతం వర్కవుట్‌ కావడం లేదు. దీంతో చాలావరకు విషయాలు నిజనిర్ధారణల మధ్య నలిగిపోతున్నాయి. అయితే.. ఫార్మర్డ్‌ రాయుళ్ల దెబ్బకు కొత్తా.. పాతా.. ఉత్త పుకార్లు వైరల్‌ అవుతూనే వస్తున్నాయి. తాజాగా.. 

మందు బాబుల కోసం మోదీ సర్కార్‌ తీపి కబురు అంటూ ఓ ప్రకటన విపరీతంగా వైరల్‌ అవుతోంది.  ఇంటింటికి కరెంట్‌.. నల్లా కనెక్షన్‌లాగా.. మందు కనెక్షన్‌ల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నది ఆ వైరల్‌ వార్త సారాంశం. ఇంటింటికే మద్యం పాలసీలో భాగంగా.. లిక్కర్‌ పైప్‌లైన్లను ప్రభుత్వం తీసుకురాబోతోందన్నది ఆ వైరల్‌ మెసేజ్‌. ఈ మేరకు హిందీలో ఓ నోటిఫికేషన్‌ కూడా రిలీజ్‌ అయ్యింది.

‘గౌరవనీయులైన ప్రధానిగారు మందు బాబుల కోసం లిక్కర్‌ పైప్‌లైన్‌ పథకం తీసుకురాబోతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండి. పీఎంవో పేరిట 11 వేల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి అప్లై చేయండి’ అంటూ ఆ ఫేక్‌ నోటిఫికేషన్‌ వైరల్‌ అవుతోంది. అప్లై చేసుకున్న వాళ్ల ఇళ్లను అధికారులు సందర్శించి.. కనెక్షన్‌ను మంజూరు చేస్తారట. పవర్‌ మీటర్లకు వాటిని కనెక్ట్ చేసి.. వాడకం ఆధారంగా బిల్లులు వేస్తారట.

ఇంత ఫేక్‌ ప్రకటనపై ఫ్యాక్ట్‌ చెక్‌ సైట్‌ పీఐబీ(ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) ఊరుకుంటుందా?.. అందుకే వెల్‌కమ్‌ చిత్రంలోని నానా పటేకర్‌ ‘కంట్రోల్‌’ మీమ్‌తో గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. అంతేకాదు అతిగా ఆశలు పెంచుకోవద్దంటూ మందు బాబులకు చిల్‌ గాయ్స్‌ అంటూ ఓ క్యాప్షన్‌ కూడా ఉంచింది.

ఇదీ చదవండి: ఇకపై వ్యాక్సిన్‌ తీసుకుంటే క్యాష్‌ రివార్డు! 

మరిన్ని వార్తలు