ఇన్ఫోసిస్‌ గుడ్‌ న్యూస్‌ ఆ ఉద్యోగులకు బోనస్‌!

20 Nov, 2023 15:16 IST|Sakshi

భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక పనితీరు ఆధారంగా ​బోనస్ చెల్లించ నుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. ఈ ఇమెయిల్ ప్రకారం, అర్హులైన ఉద్యోగులకు మాత్రమే 80 శాతం వెరియబుల్ పే చెల్లిస్తుంది. జూలై-సెప్టెంబర్ కాలానికి పనితీరు బోనస్‌కు  కొంతమంది ఉద్యోగులు అర్హులు కారని  ప్రకటించడం ఉద్యోగుల్లో నిరాశ నింపింది. ఈ నెలలో గటున 80 శాతం చెల్లింపుతో అందజేస్తుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి క్యూ2కి సంబంధించి 6వ (PL6-మేనేజర్) స్థాయి, అంతకంటే తక్కువ బ్యాండ్‌లో ఉన్న ఉద్యోగులు సగటున 80 శాతం వేరియబుల్ పేగా అందుకుంటారు. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, నిర్వహించిన పాత్ర ఆధారంగా ఈ  బోనస్‌ ఉంటుందని తెలిపింది. బోసన్  ఎంత అనేది యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని పేర్కొంది. 

కాగా గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభంఏడాది ప్రాతిపదికన 3.2 శాతం స్వల్పంగా పెరిగి రూ. 6,212 కోట్లకు చేరుకుంది ఆదాయం  కూడా 7 శాతం వృద్ధితో రూ. 38,994 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ, కంపెనీ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను FY24కి 1 శాతం-2.5 శాతానికి సవరించింది.

మరిన్ని వార్తలు