మీరంతా దేశం గర్వపడేలా చేశారు: ప్రధాని మోదీ

22 May, 2022 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ: థామస్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. కప్‌ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్‌ టీంతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ ముఖాముఖీలో ప్రధాని ఆటగాళ్లందరితో సరదాగా మాట్లాడారు.

సింగిల్స్‌, డబుల్స్‌ లో అద్భుతంగా రాణించిన భారత్‌ ఫైనల్లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఇండోనేషియాపై 3-0తో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో తొలిసారి కప్‌ అందుకుంది. థామస్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి నజరానాగా ప్రకటించన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు