రాహుల్‌పై ప్రణబ్‌ ముఖర్జీ ఆగ్రహించారా..?

12 Dec, 2023 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్‌ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్‌ మై ఫాదర్‌..ఎ డాటర్‌ రిమెంబర్స్‌’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్‌ను షర్మిష్ట లాంచ్‌ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్‌,రాహుల్‌గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు.

‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్‌ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.

ఆ ఆర్డినెన్స్‌ కాపీని 2013 సెప్టెంబర్‌లో ఎంపీ రాహుల్‌ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్‌కు చెప్పింది నేనే. రాహుల్‌ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజానికి రాహుల్‌ అలా ఆర్డినెన్స్‌ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్‌ చర్యను వ్యతిరేకించారు. రాహుల్‌  ప్రభుత్వ క్యాబినెట్‌లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్‌ను చింపివేయడానికి అని ప్రణబ్‌ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. 

ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్‌ రౌత్‌పై కేసు 

>
మరిన్ని వార్తలు