యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం..

24 Apr, 2023 08:34 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సాముహిక వివాహ పథకం వివాదాస్పదంగా మారింది. ఆ పథకంలో భాగంలో మధ్యప్రదేశ్‌లోని గడ్సరాయ్‌ ప్రాంతంలో శనివారం 219 మందికి సాముహిక వివాహాలు నిర్వహించారు. ఐతే అందులో ఐదుగురు యువతులు గర్భవతులు అని తెలియడంతో వారిని సాముహిక వివాహాలకు అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ వివాదానికి తెరలేపింది. అయినా పెళ్లి చేసుకోడానికి వచ్చిన యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం ఏమిటని కాంగ్రెస్‌ పశ్నించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపణలు  చేసింది.

ఈ మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 200 మంది యువతులకు ప్రెగన్సీ టెస్ట్‌లు నిర్వహించారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ వార్త నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి నుంచే వినాలనుకుంటున్నాం. ఈ వార్త నిజమైతే సామాజికంగా వెనుకబడిని యువతులను ఘెరంగా అవమానించడమే అవుతుంది. ముఖ్యమంత్రి దృష్టిలో పేద, గిరిజన వర్గాల ఆడబిడ్డలకు పరువు లేదా అని నిలదీశారు. శివరాజ్‌ ప్రభుత్వంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో ఇప్పటికే మధ్యప్రదేశ్‌ అగ్రస్తానంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.

ఇది కేవలం గర్భ నిర్ధారణ పరీక్షకు సంబంధించింది కాదని ఇది మొత్తం స్త్రీ జాతి పట్ల దురుద్దేశంలో కూడిన వైఖరి అని మండిపడుతూ ట్వీట్‌ చేశారు. అయితే డిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సాధారణంగా వయస్సు ధృవీకరణ, సికిల్‌ సెల్‌ అనీమియా వంటి శారీరక దృఢత్వాన్ని నిర్థారించే పరీక్షలు నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయిని తెలిపారు. అందులో కొందరు యువతులకు పీరియడ్‌ సంబంధిత సమస్యలు ఉన్నాయి.

దీంతోనే వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తాము కేవలం పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తామని చెప్పారు. అయితే ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా యువతలను పథకంలో మినహాయించే నిర్ణయం మాత్రం సామాజికి న్యాయ శాఖ తీసుకుంటుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి వివాహ యోజన పథకం / నికా యోజన ఏప్రిల్‌ 2006లో ప్రారంభమైంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా రూ. 56,000/- నగదును అందిస్తోంది.

(చదవండి: భార్య అరెస్టు అవుతుందనే భయంతో అమృత్‌పాల్‌ సింగ్‌ లొంగిపోయాడా?)

మరిన్ని వార్తలు