పబ్జీని బ్యాన్‌ చేసినా భారత్‌లో ఆడొచ్చు!

3 Sep, 2020 11:57 IST|Sakshi

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకోవడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ గేమ్‌తో పాటు 118 ఇతర యాప్‌లు కూడా ఉన్నాయి. భారతదేశంలో 50 మిలియన్‌ మందికి పైగా పబ్జీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్‌ను మొదట దక్షిణ‌ కొరియా తయారు చేసింది. దీనిని డెస్క్‌టాప్‌ వర్షన్‌లో ఆడొచ్చు. తరువాత సౌత్‌ కొరియా నుంచి లైసెన్స్‌ పొందిన చైనా కంపెనీ టెన్‌సెన్ట్‌ పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు చైనా, భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీతో సంబంధం ఉన్న పబ్జీ మొబైల్‌ యాప్‌ను కేంద్రం నిషేధించింది. అయితే భారత్‌లో డెస్క్‌టాప్‌లో ఈ ఆటను ఆడవచ్చు. డెస్క్‌టాప్‌ మోడ్‌ను సౌత్‌కొరియా రూపొందించి కాబట్టి దానిని ఇండియాలో బ్యాన్‌ చేసే అవకాశం లేదు.  

పబ్జీ యాప్‌ ఏమౌతుంది:
టిక్‌టాక్‌ మాదిరిగానే పబ్జీయాప్‌ ఇంకా గూగుల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేంద్రం ఆదేశాలు అందగానే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆ యాప్‌ను తొలగిస్తారు. అయితే అంతకుముందు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఉన్నప్పటికి ఎయిర్‌టల్‌,జియో మిగత నెట్‌ వర్క్‌లు తమ సర్వర్ల నుంచి పబ్జీ ఐపీ అడ్రస్‌ను తొలగించడంతో గేమ్‌ ఓపెన్‌ అవదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ గేమ్‌ ఆడటానికి వీలు లేదు అంటూ ఒక పాప్‌అప్‌ కనిపిస్తోంది.

మళ్లీ భారత్‌లో పబ్జీ ఎప్పుడు వస్తుంది
భారత్‌-చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న నేపథ్యంలో భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కొన్ని చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ వివాదాలు ముగిసిన తరువాత టిక్‌టాక్‌తో సహా పబ్జీ, హలో మిగిలిన యాప్స్‌ అన్నింటిని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా, లేదా అనేది వేచిచూడాలి.

చదవండి: పబ్జీ గేమ్‌ను నిషేధించిన కేంద్రం

మరిన్ని వార్తలు