పంజాబ్‌లో నిరుద్యోగులకు శుభవార్త

15 Aug, 2020 16:55 IST|Sakshi

చండీగఢ్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వరాల జల్లు ప్రకటించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సీఎం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 6లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ప్రభత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు, ప్రయివేట్‌ రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ఘర్‌ ఘర్‌ రోజ్‌గర్‌ పథకం ద్వారా 13లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించిందని, భూమి లేని రైతులు, కూలీలకు రూ.520కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

త్వరలోనే కౌలు రైతుల కోసం తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు జాతీయ రహదారుల కల్పనకు రాబోయే రెండేళ్లలో రూ.12,000కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంతో సేవలందిస్తున్నారని అమరీందర్‌ సింగ్‌ కొనియాడారు. 
చదవండి: విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు

మరిన్ని వార్తలు